Thursday 8 November 2012


         వీసీ నియామకం నిలిపివేత 

     ఎన్జీరంగా వర్సిటీ వీసీ నియామకంలో హైడ్రామా చోటు చేసుకుంది. వైస్ ఛాన్స్ లర్ గా తూర్పగోదావరి జిల్లాకు చెందిన అల్లూరి  పద్మరాజును నియమిస్తూ ఫైలుపై సంతకం చేసిన  కొన్ని  గంటల్లోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు గవర్నర్ నరసింహన్ . వీసీ నియామక ఉత్వర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. వీసీ వివాదంపై హైకోర్టులో కేసు ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ముందు ఉత్తర్వులు ఇచ్చే సమయానికి కేసు విషయం తెలియదని వివరణ ఇచ్చింది. అయితే వర్సిటీలో తెలంగాణ వాదుల నిరసనల వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
వీసీగా పద్మరాజు పేరు ఖారారైందని తెలయగానే  ఎన్జీరంగా వర్సిటీలో తెలంగాణ వాదుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ఫర్నిచర్ తో పాటు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు శవయాత్ర నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మ దగ్దం చేశారు. తెలంగాణ వ్యక్తినే వీసీగా నియమించాలని రోడ్డుపై రాస్తారోకో చేశారు. 
కొత్తగా ఏర్పాటైన వర్సిటీ పాలకమండలి గత నెల 16 న జరిగిన సమావేశంలో వీసీగా అల్లూరి పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం చేసింది. ఆ వివరాలను గవర్నర్ కు పంపించింది. సీమాంధ్ర వ్యక్తిని వీసీ గా నియమించొద్దంటూ వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది నిరసనకు దిగారు. తెలంగాణ వారినే వీసీ గా నియమించాలని మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ  జేఏసీకి కూడా వీరిక మద్దతు ప్రకటించింది. అయితే వీసీ నియామకంలో నిబంధనలు పాటించలేదని రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం దేవేందర్ రెడ్డి హైకోర్టను ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని  న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివరాలు తెలియకపోవడంతో  గవర్నర్ వీసీ గా పద్మరాజు పేరు ఖరారు చేస్తూ  ఫైలు పై సంతకం చేశారు. ఆ తర్వాత వెంటనే ఉత్వర్వలు నిలివేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

No comments:

Post a Comment