Sunday 10 February 2013



      వీర్యం స్మగ్లింగ్


జైళ్లలో ఉన్న బడా ఖైదీలకు బయటి నుంచి సెల్ ఫోన్లు, బిర్యానీ పార్శిళ్లు అందడం చూస్తాం. ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్ జైళ్లలో కొత్తరకం స్మగ్లింగ్ నడుస్తోంది. కారగారాల నుంచి ఏకంగా ఉగ్రవాదుల వీర్యం బయటకు రవాణా అవుతోంది. తమతో పాటే పోరాటం అంతం కాకుండా వారసులను కనేందుకు ఈ ప్లాన్ వేశారు ఉగ్రవాద ఖైదీలు. 
ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్నా ఉద్రవాదుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.తాముపోయినా వారసులు జీహాద్ ను కొనసాగించాలని కలలు కంటున్నారు. ఇందుకోసం ఏకంగా జైళ్ల నుంచి రహస్యంగా  భార్యలకు తమ వీర్యాన్ని రవాణా చేస్తున్నారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ... ఇది నిజం.
దాడుల్లో పట్టుబడిన వేలాది మంది పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ జైళ్లలో  శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్లలో చాలామందికి 25 ఏళ్లకుపైగా   యావజ్జీవ  శిక్ష విధించాయి అక్కడి న్యాయస్థానాలు . దీంతో ఉద్రవాదుల లైఫంతా కారాగారంలోనే గడపాల్సిన పరిస్థితి . అయితే  పలువురు ఖైదీలు తమ వీర్యాన్ని జైలు బయటికి పంపించి భార్యలు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు పాలస్తీనా మహిళలు ... తమ భర్తల వీర్యంతో కృత్రిమ పద్ధతుల్లో సంతానం పొందారు. ఓ ఖైదీ భార్య దలాల్ అల్ జిబెన్ ఈమధ్యే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్తకు ఇజ్రాయెల్ కోర్టు 27 ఏళ్ల యావజ్జీవ శిక్ష విధించింది. జెరూసలెం మార్కెట్లో బాంబుదాడులకు పాల్పడినందుకు మరో 25 ఏళ్ల కారగార శిక్షపడింది. ఇవన్నీ పూర్తయి అతడు బయటకు రావడం జరగని పని. మరొకరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడని దలాల్ ... భర్త ద్వారే బిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్లే చేసింది.  ఖైదీల్లో చాలామంది భార్యలది ఇదే పరిస్థితి.అయితే  కొన్ని దేశాల్లోలాగా ఇజ్రాయెల్ జైళ్లలో  ఖైదీలకు దాంపత్య కలయిక అవకాశం లేదు.
వైద్యులు చెబుతున్న ప్రకారం.. స్ఖలనం జరిగాక సాధారణ వాతావరణంలో వీర్యకణాలు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు జీవించి ఉండలేవు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ఖైదీలు తమ వీర్యాన్ని కప్పులు, ఆయింట్ మెంట్ ట్యూబుల్లో  వెస్ట్ బ్యాంకు నాబ్లుస్ పట్టణంలోని 'రజాన్ మెడికల్ సెంటర్ ఫర్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్'కు తరలిస్తున్నారు. అక్కడ డాక్టర్ సలీమ్ అబు ఖైజరాన్ ఆ వీర్యంతో ఉగ్రవాదుల భార్యలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ వీలు కల్పిస్తున్నారు. 
ఇదంతా ఎలా సాధ్యమవుతోందని చెప్పడానికి ఖైదీల భార్యలు నిరాకరిస్తున్నారు. తన వద్ద ఉగ్రవాదుల వీర్యం నమూనాలు డజన్ల కొద్దీ ఉన్నాయంటున్నారు డాక్టర్ సలీమ్ .జైలు సిబ్బంది సాయంతో ఖైదీల వీర్యం బటయకు వెళుతోన్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి అవకాశమే లేదని జైలు అధికారులు కొట్టిపారేస్తున్నారు.  పాశ్చత్య దేశాల్లోలాగా ఖైదీలకు తమ భార్యలను కలుసుకునే అవకాశం కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.