Friday 5 April 2013


         లోకేశ్ బ్యాక్ ఆఫీస్ 

టీడీపీకి పకడ్బందీ నెట్ వర్క్, బ్యాక్ ఆఫీస్ ఉంటాయి. వీటి సాయంతోనే చంద్రబాబు పార్టీని ఇన్నాళ్లు పటిష్టంగా నడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీపై కాన్సంట్రేట్ చేస్తున్న చినబాబు లోకేశ్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నారు.  అయితే తండ్రి సెటప్ చేసిన నెట్ వర్క్  కాకుండా తనకంటూ ప్రత్యేక బ్యాక్ ఆఫీస్ రెడీ చేసుకుంటున్నారు. బహుషా ఇప్పుడున్నది అవుట్ డేటెడ్ అనుకున్నారేమో... అంతా కొత్త తరంతో బ్యాక్ ఆఫీస్ రెడీ చేసుకునేందుకు లోక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెటప్ ప్రధానంగా మీడియా వార్తలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది.  ఛానెళ్లను మానిటర్ చేస్తూ.... టీడీపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన వార్తలను ఇందులోని ఒక టీం విశ్లేసిస్తుంది.  ఈ ప్రణాళిక కోసం కొందరు సీనియర్ జర్నలిస్టుల కోసం లోకేశ్ అన్వేశిస్తున్నట్లు  ఎన్టీఆర్ భవన్ లో టాక్.
లోకేశ్ బ్యాక్ ఆఫీసులో రెండో కీలక టీం సర్వే స్పెషలిస్ట్... ఎప్పటికప్పడు సర్వేటీం చేసిన రిపోర్ట్ లను సేకరించి కంప్యూటర్ లను ఎక్కించి గతంతో పోల్చుతూ విశ్లేషణ చేయడం దీని విధి. ఇతర సర్వే ఏజేన్సీల రిపోర్టు, తమ వాళ్ల నివేదికలను  కలిపి రివ్యూ చేస్తుంది.  ఈ రిపోర్ట్ అనాలసిస్ లోకేశ్ స్వయంగా చేయనున్నారని సమాచారం. టీడీపీకి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తల్లో పార్టీ పరిస్థితి మేరుగు పడిందా.... వెనుక బడిందా అన్న వార్తల్ని కూడా బ్యాక్ ఆఫీస్ ప్రత్యేకంగా విశ్లేసించనుంది.
ఇక మరో ప్రధాన టీం ప్రతి నియోజకవర్గంలో  పార్టీ నాయకుల పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి కంప్యూటర్ లో ఎక్కిస్తుంది. సర్వేల ద్వారా వచ్చిన ఫలితాలతో విశ్లేసిస్తూ అభ్యర్థిని ప్రకటించడంలో తండ్రికి లోకేశ్ చేదోడు వాదోడుగా ఉంటబోతున్నారట. ముఖ్యంగా టీడీపీలో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి  విశ్లేషణ చేయటంలో బ్యాక్ ఆఫీస్ ప్రత్యేక పాత్ర పోశించబోతోంది. కేవలం కంప్యూటరీకరణ, సమాచార సేకరణే కాకుండా లోకేశ్ కు పార్టీ పై పట్టుసాధించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నది పార్టీ నేతల భావన. మొత్తానికి ఏదోఒకరూపంలో లోకేశ్ వచ్చే ఎన్నికల్లోగా పార్టీపై పూర్తి పట్టుసాధించేందుకు కంప్యూటర్ల సాయంతో పావులు కదుపుతున్నారు.