Saturday 3 November 2012


 అధికార దుర్వినియోగం

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూతురు అనూష వివాహాం అట్టహాసంగా జరిగింది. సినిమా హీరోల మ్యారేజ్ లెవల్ లో భారీ సెట్టింగ్ లు ,  ఏర్పాట్లు చేశారు సత్తిబాబు. పెళ్లికి వీవీఐపీలు , వీఐపీలు తరలివచ్చారు. రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు , అధికారులూ క్యూ కట్టారు. సీఎం కిరణ్ , డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, చిరంజీవి , రాష్ట్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు,  తెలంగాణ నేతలు వివాహానికి  హాజరై వధువరులను ఆశీర్వదించారు. అయితే వీఐపీల ఏర్పాట్ల కోసం బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమ ర్శలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర  జిల్లాల అధికారులు  ప్రజా సమస్యలను పట్టించుకోకుండా  మూడు రోజుల పాటు అతిథుల బస, రావాణ ఏర్పాట్లలో  మునిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. మ్యారేజీకి 750 మందికిపైగా పోలీసుల సేవలు  వినియోగించు కోవడం కూడా వివాదాస్పదమైంది. 
బొత్సవారి ఇంట్లో వివాహం కోసం విశాఖ, విజయనగరంలో ట్యాక్సీలన్నీ రవాణాశాఖ అధికారులు బలవంతంగా సేకరించారు. విశాఖ ఆర్టీఏ అధికారులు 300 ఇన్నోవా, స్కార్పియో, టవేరా ట్యాక్సీలను గురువారం నుంచే తమ ఆధీనంలోకి  తీసుకున్నారు. ఇతర పెళ్లిళ్లకు బుక్ అయిన వాహనాలను కూడా  బలవంతంగా తీసుకున్నట్లు  స్థానికులు చెబుతున్నారు.  మరోవైపు విశాఖలోని హోటళ్లు, అతిథిగృహాలు  వీఐపీల కోసం బుక్ చేశారు. మందుగా రిజర్వ్ చేసుకున్న వాళ్లను బెదిరించారన్న ఆరోపణలున్నాయి. బొత్స అధికార దుర్వినియోగంపై ఫోరం ఫర్ బెటర్ విశాఖ మండిపడింది. సీఎం, గవర్నర్లు వస్తున్నారు  వెహికిల్స్ కావాలంటూ   విశాఖ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పేరుతో ట్యాక్సీ ఆరపరేటర్లకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
కూతురు వివాహానికి బొత్స ప్రభుత్వ సేవలతో పాటు అధికారులను వినియోగించుకోవడం తప్పే అన్నారు కాంగ్రెస్  జాతీయ అధికార ప్రతినిధి పీసీ చాకో . బొత్సపై చర్య తీసుకుంటారా అన్నదానిపై సమాధానం వేశారు. మొత్తమ్మీద తుఫాను తాకిడితో అల్లాడుతున్న బాధితుల్ని పరామర్శించే తీరకలేని నేతలంతా పెళ్లికోసం విజయనగరం వెళ్లడం విమర్శలకు దారితీసింది.

No comments:

Post a Comment