Thursday 1 November 2012


                        విద్రోహదినం



రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా జరపాలన్న టీజేఏసీ పిలుపు మేరుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాదుల నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తపరిచారు. టీజేఏసీ నేత కోదండరాంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఉద్యోగం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అడ్డుకునేందుకై ఓయూ నుంచి  హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా గన్‌పార్క్ వద్ద టీఆర్ఎల్‌డీ, టీజీ మాలమహానాడు నిరసన తెలిపింది.తెలంగాణ భవన్‌లో టీఆర్‌నేత నాయిని నర్సింహారెడ్డి నల్లజెండాను ఎగురవేశారు.సచివాలయ తెలంగాణ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లోకి హాజరయ్యారు. టీజేఏసీ నేత కోదండరాంను హౌస్ అరెస్ట్ చేయడంతో ఇంటి ఎదుట కోదండరాం, నాగం జనార్దన్‌రెడ్డి నల్లజెండాను ఎగువేసి నిరసన తెలిపారు.ఓయూ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్‌సీసీ గేటు వద్దే నల్లజెండాను ఎగురవేసి విద్యార్థులు నిరసన తెలిపారు.వరంగ ల్ జిల్లాలో ప్రభుత్వకార్యాలయాలపై తెలంగాణ వాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. మహబూబాబాద్‌లో 200 మీటర్ల నల్లజెండాతో విద్యార్థులు నిరసన తెలిపారు.మెదక్ జిల్లాలో ప్రభుత్వం కార్యాలయాల్లో తెలంగాణ వాదులు నల్లజెండాను ఎగురవేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కరీంనగర్ జిల్లాలో నారదాసు లక్ష్మణరావు పోలీసుల క్వార్టర్స్‌ను ముట్టడించారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment