కాంగ్రెస్ కు డిసెంబర్
గండం

తాజాగా పార్లమెంట్ లాబీలో పార్టీ అధినేత్రి సోనియాను కలిసి తెలంగాణపై
త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖ సమర్పించారు టీ కాంగ్రెస్ ఎంపీలు . మేడమ్
సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. రెండు రోజుల్లో పిలిచి మాట్లాడతానని
చెప్పారంటున్నారు. అయితే తెలంగాణపై మూడేళ్లుగా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్న
హైకమాండ్ పదిరోజుల్లో నిర్ణయం
తీసుకుంటుందా?
అన్న అనుమానం
నేతలను వేధిస్తోంది. రాష్ట్రవిభజనపై స్పష్టమైన ప్రకటన రాకుంటే కేంద్రం
తెలంగాణ ఇవ్వదని భావించాల్సి
ఉంటుందంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు . తమదారి తాము చూసుకోక తప్పదని
హెచ్చరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు
వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే సీమాంధ్ర ప్రాంత
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు
వైసీపీలోకి జంపయ్యే పరిస్థితి
కనిపిస్తోంది.
డిసెంబర్ 9 గండాన్ని హైకమాండ్
ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు అందరిలో
ఉత్కంఠ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందునా తెలంగాణపై నిర్ణయానికి
ఇదే సరైన టైమ్ అంటున్నారు నేతలు . ఒక వేళ ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇతర పార్టీల్లోకి వలస వెళితే ... ఆ ప్రభావం
రాష్ట్ర సర్కార్ తో పాటు కేంద్రంపైనా
ఉందంటున్నారు . చేతులు కాలాక ఆకులు పట్టుకున్నదానికంటే ... ముందే జాగ్రత్త పడడం
మంచిదని అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment