Thursday 1 November 2012

                                      భూమికి సమీపంలో కృష్ణబిలం
          
భూమికి 1,344 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న ఓరియన్ నక్షత్ర మండలం (నెబ్యులా)లో ఓ భారీ బ్లాక్‌హోల్ (కృష్ణబిలం) ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతి ప్రకాశవంతమైన ఓరియన్ నెబ్యులా రాత్రిపూట ఆకాశం లో నేరుగా కూడా కనిపిస్తుంది. దీనిలోని నక్షత్రాలు సుడులు తిరుగుతున్నట్లు వేగంగా కదులుతున్నాయని కూడా శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. అయితే, అక్కడ సూర్యుడి కన్నా 200 రెట్లు ద్రవ్యరాశితోగల కృష్ణబిలం ఉండటం వల్లే నక్షత్రాలు అలా దాని చుట్టూ గిరికీలు కొడుతున్నాయని తేలినట్లు తాజాగా యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ పరిశోధకులు ప్రకటించారు.

10 లేదా 20 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడినట్లుగా భావిస్తున్న ఓరియన్ నెబ్యులా అనేక విచిత్రాలకు నెలవుగా ఉందని వెల్లడించారు. దీనిలో తేలికపాటి నక్షత్రాలు ఎక్కువగా ఉండగా, ద్రవ్యరాశి అధికంగా ఉన్నవి, అతివేగంగా తిరిగేవి చాలా తక్కువగా ఉన్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నక్షత్రాలెలా ఏర్పడ్డాయి? ఎలా దూరంగా వెళ్లాయి? అన్నది అంతుచిక్కడం లేదని శాస్త్రవేత్తలు
అంటున్నారు.

No comments:

Post a Comment