Friday 12 October 2012

కార్పొరేషన్ కు కన్నం 

 
   అధికారి  అన్న విషయాన్ని మరిచిపోయాడు... అక్రమ సంపాదనకు బరితెగించాడు. ఫ్రాడ్ తో చేతులు కలిపి మైనార్టీ కార్పొరేషన్ కే కన్నం వేశాడు. వందల కోట్ల నిధులు గోల్ మాల్ కు కారకుడయ్యాడు.  బండారం బయట పడటంతో  ఆధారాలు దొరకుండా ఫైళ్లు మాయం చేయాలనుకున్నాడు. సిబ్బంది అలెర్ట్ కావడంతో దొరికిపోయాడు. మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఎండీ ఇలియాస్ రిజ్వీ... బాగోతమితి.

     మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల స్వాహా విషయం బయటపడడంతో ఆ సంస్థ ఎండీ ఇలియాస్ రిజ్వీపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఇద్దరు ఉద్యోగులను కూడా  సస్పెండ్ చేసింది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న తర్వాత కొన్ని   ఫైళ్లు తీసుకొని ఉడాయించేందుకు ప్రయిత్నించిన రిజ్వీని ఉద్యోగులు అడ్డుకున్నారు. ఫైళ్లను లాక్కొని కార్పొరేషన్ కార్యదర్శి దానకిషోర్ కు అప్పగించారు. ఈ భారీ కుంభకోణంలో రిజ్వీదే ప్రధాన ప్రాత ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు సీఐడీ అధికారులు. కొన్ని సాక్ష్యాలు సేకరించాక... రిజ్వీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమీషన్ల కక్కుర్తి కోసం కార్పొరేషన్ నిధులను బ్యాంకుల్లో ఫిక్స్ డ్ చేయడం ఒక ఎత్తైతే... ఆ నిధుల మోసగాళ్లకు ఫలహారం అయ్యేందుకు సహకరించడం మరో ఎత్తు! మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో 55.47 కోట్ల గోల్ మాల్ పై సీఐడీ జరుపుతున్న విచారణలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 

కుంభకోణం సూత్రధారి, వన్ కార్డ్ నిర్వాహకుడు సాయికుమార్ ముఠాకు కార్పొరేషన్ అధికారుల సహకారం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రిజ్వీకి కమిషన్ ఇచ్చినట్లు మధ్యవర్తి అంగీకరించాడు. తన అక్రమ వ్యాపారానికి మైనార్టీ కార్పొరేషన్  నిధులను పెట్టుబడిగా వాడుకున్నాడు సాయికుమార్ . విజయా బ్యాంక్ లో 16 బినామీ కంపెనీల పేరుతో ఎకౌంట్లు తీసి... కార్పొరేషన్ నిధులు తమ అకౌంట్లోకి మళ్లేలా ప్లాన్ చేశాడు . ఇందుకోసం బ్యాంకు, కార్పొరేషన్ల అధికారులతో కుమ్మక్కయ్యాడు. ఫేక్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ లో 100 కోట్లు రుణం పొందేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. మైనార్టీ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ ఆరా తీయటంతో... అసలు బండారం బయటపడింది.
     ఇక వన్ నేషన్ వన్ కార్డ్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక అకౌంట్లున్న వ్యక్తికి... ఒకే కార్డు ఎలా యూజ్ అవుతుందనేది పెద్ద డౌట్ గా మారింది. పోనీ వీళ్లు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారా అంటే... దానిపైనా స్పష్టతలేదు. ఒకవేళ కార్డు పోతే... కస్టమర్ పరిస్థితి ఏంటి అనేదానిపైనా  క్లారిటీలేదు. మరోవైపు వన్ కార్డు వన్ నేషన్ తో...తమకు ఎలాంటి ఒప్పందాలు లేవని బ్యాంకులు స్పష్టంచేస్తున్నాయి.
      విజయబ్యాంకుల్లోని నిధులు దారిమళ్లడంతో మరో  26  అకౌంట్లకు సంబంధించిన వివరాలు పంపించాలని బ్యాంకులకు లెటర్ రాశారు కార్యదర్శి దానకిషోర్ . మైనార్టీ  స్కాలర్ షిప్ ల సొమ్ము గోల్ మాల్ పై కూడా చర్యలు చేపట్టారు. కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఎఫ్ డీ నిధులతో అక్రమాలకు ఆస్కారం కల్పించిందని విజయా బ్యాంకుపై మైనారిటీ సంక్షేమ శాఖ ఆర్ బీఐకి ఫిర్యాదు చేసింది.

No comments:

Post a Comment