Friday 10 August 2012




పార్టీ ఏర్పాటుతో మార్పు సాధ్యమా?

సమాజంలో మర్పుకు రాజకీయ పార్టీ ఏర్పాటు తప్పని సరా? ఉద్యమాల ద్వారా మార్పు సాధ్యం కాదా? ఇప్పుడిదే దేశంలో సర్వత్రా చర్చ. జన్ లోకోపాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నా హజారే బృందం ..... రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరించింది. అవినీతికి వ్యతిరేకంగా  అన్నా టీం సాగించిన మహోద్యమం దేశంలో నూతన అధ్యయానికి నాంది పలికింది. మధ్యతరగతి వర్గాలతో పాటు యువతను విశేషంగా ఆకర్షించింది.  ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర  మొదటి సారి దీక్ష చేపట్టి మొత్తం దేశాన్ని కదిలించిన అన్నా . అయితే ఆ తర్వాత ముంబైలో చేపట్టిన దీక్షకు పెద్దగా స్పందన లభించలేదు. మరోసారి ఆగస్టులో దీక్ష చేపట్టి అర్థరంగా విరమించారు . ఈదీక్షకు  ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో పార్లమెంటులో ప్రవేశించి ప్రజలకు కోరుకున్న చట్టాలు తెస్తామని ప్రకటించారు. మార్పు కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమని చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరనని , పోటీ చేయనని తెలిపారు.
  అన్నా ఉద్యమం ఫెయిల్ కావడానికి అనేక కారణాలున్నాయి. దీక్ష చేపట్టినప్రతీసారి డిమాండ్లు మారడం ఒకటయితే , అన్నా బృందంలో విభేదాలు రావడం... సభ్యుల్లో కొందరిపై  వ్యక్తిగత ఆరోపణలు వంటి కారణాలు పనిచేశాయి. మొదట అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన హజరారే టీం, ఆ తర్వాత అవినీతి మంత్రులను టార్గెట్ చేసింది. లోక్ పాల్ పై కూడా పట్టువిడుపులు లేకుండా మొండిగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. ఉద్యమం దారి తప్పిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో హజారే టీంపై  జనానికి నమ్మకం తగ్గిపోయింది . దీనికి తోడూ ఉద్యమాల నిర్వహణలోనూ అన్నా టీం విఫలమయింది. ఆందోళనలో వైరుద్యం లేకుండా రోటీన్ దీక్షలకే పరిమితమయ్యారు. వారం , పదిరోజులు దీక్ష చేయడం , విరమించడం కామన్ అయింది. చేస్తే దీక్ష చేయడం లేదంటే సైలెంట్ గా ఉండటం ... దీంతో జనానికి నమ్మకం పోయింది.
  అటూ అన్నా టీం ను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. దీక్షలకు ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటూ ఎదరు చేయడంతో పాటు సభ్యుల్లో కొందరిని టార్టెట్ చేయడంలో సఫలమయింది.
అవినీతి రహిత సమాజం కోసం ఉద్యమం చేపట్టిన అన్నా బృందం ఇప్పుడు రాజకీయ పార్టీ గా మారబోతోంది. కోర్ కమిటీని రద్దు చేసినట్లు అన్నా తన బ్లాగ్ లో ప్రకటించినా... అదే టీంతో ఇప్పుడు పార్టీ రూపంలో ప్రజలముందుకు రానుంది. 2014 ఎన్నికలే టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  ప్రణాళిక , లక్ష్యాల రూపకల్పనలో బిజీగా ఉన్నారు . అయితే ఎన్నికల్లో గెలుపు అంతా ఈజీకాదు. దిగితేనే గాని అందులో లోతు తెలియదు. పార్టీ ఏర్పాటు తో సమాజంలో మార్పు తీసుకురాడం పగటి కలే. పార్లమెంట్ చట్టాలు చేయడానికి కావల్సిన సంఖ్య బలాన్ని కొత్తగా ఏర్పడే పార్టీ సాధిస్తుందా? అంటే ప్రస్తుత పరిస్థితిలో కష్టమనే చెప్పాలి. ఇప్పటకే దేశంలో రిజిస్టర్ అయిన పార్టీలు 1139 ఉన్నాయి. హజారే టీం పార్టీ ఏర్పాటు చేడయంతో ఆ సంఖ్య 1104 చేరుతుంది. అంతే తప్ప కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు.

No comments:

Post a Comment