ALOCHANA
Saturday, 20 June 2020
Monday, 1 February 2016
RSS DRESS CODE
ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ లో మార్పు?
హిందూ మతానికి ప్రతినిధిగా ఉన్న ఆర్ఎస్ఎస్
తన డ్రెస్ కోడ్ ను మార్చుకునేందుకు సిద్ధమైంది. తెల్లచొక్కా, ఖాకీ నిక్కర్, లెదర్ బూట్లు, కాన్వాస్ బెల్టు, నల్లటోపీ, చేతిలో కర్ర.. దాదాపు
తొమ్మిది దశాబ్దాలుగా ఇది కరసేవకుల డ్రెస్ కోడ్.
ఇప్పుడీ కోడ్ లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మార్చిలో జరగనున్న ప్రతినిధి సభ (ఆర్ఎస్ఎస్ అత్యున్నత
స్థాయీ సంఘం) లోనే డ్రస్ కోడ్ మార్పునకు సంబంధించిన నిర్ణయం ఖరారు కానుంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ శాఖల్లోకి
యువకులు పెద్ద ఎత్తున చేరుతున్న క్రమంలో వారిని
మరింతగా ఆకట్టుకునేలా నిక్కర్ స్థానంలో ట్రౌజర్ ప్రవేశపెట్లాలని ఆ సంస్థ భావిస్తోంది.
'కరసేవకుల డ్రస్ కోడ్ మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే మార్చిలో నాగౌర్ (రాజస్థాన్)లో జరగనున్న ప్రతినిధి సభలో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది' అని ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం బాధ్యుడు మోహన్ వైద్య తెలిపారు. మార్పులకు అంగీకారం లభిస్తే ఈ ఏడాది విజయదశమి నుంచే కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి తెస్తామని వైద్య పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంస్థ సీనియర్ నాయకులు ఇప్పటికే మూడు డిజైన్లకు ఓకే చెప్పారు. తెలుపు చొక్కాకు కాంబినేషన్ గా బ్లూ, గ్రే లేదా బ్రౌన్ కలర్ ట్రౌజర్ ను కొత్త డ్రెస్ కోడ్ గా ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఫ్యాషన్ డిజైనర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
సంస్థాగతమైన మార్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించే ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ మారిస్తే అది సంచలనాత్మకమే అవుతుంది. ఎందుకంటే గడిచిన 91 ఏళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే డ్రెస్ కోడ్ లో మార్పులు చేసిందా సంస్థ. ఆవిర్భవించిన 14 ఏళ్ల తర్వాత.. అంటే, 1939లో ఖాకీ చొక్కా స్థానంలో తెలుపు రంగు చొక్కాలను ప్రవేశపెట్టింది. మళ్లీ 1973లోగానీ సేవకులు ధరించే బూట్ల విషయం కొన్ని సడలింపులకు ఓకే చెప్పింది. 2010లో జైన మత గురువు తరుణ్ సాగర్ సూచన మేరకు లెదర్ బెల్ట్ స్థానంలో కాన్వాస్ బెల్టులు ధరించాలనే నిర్ణయమే డ్రెస్ కోడ్ విషయంలో ఆర్ఎస్ఎస్ చివరి మార్పు. అప్పటి నుంచి పలు అభ్యర్థనలు వచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

Friday, 18 September 2015
సంక్రాంతి కోళ్ల పందాలు
పల్లెల్లో సంక్రాంతి హడావిడి మొదలయింది. కోళ్లపందాల జోరుఊపందుకుంటోంది. ఆస్తి , అంతస్తులు పణంగా పెట్టే వేట మళ్లీమొదలైంది. పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లుజీడిపప్పు, బాదం పప్పు లాంటివి పెట్టి కంటికి రెప్పలా పెంచినయజమానులు.. బరిలోకి దిగి.. మీసం మెలేస్తున్నారు. కాయ్ రాజాకాయ్ అంట పందేలకు దిగుతున్నారు. ఈ ఆటలో పడి... వేటలోమునిగి ఎంతోమంది కుబేరులు- బికారులయ్యారు.
సంక్రాంతి సీజన్వచ్చిందంటే పల్లెల్లోహడావుడిమొదలవుతుంది.పల్లెజనం మేల్కొనేదికొక్కొరోకో సౌండ్తోనే.సంకురాత్రి సంబరాల్లో...కోస్తా వాసులకు పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ... కోళ్ల పందాలే!అంతవరకూ బాగా మేపిన కోళ్లను బరిలోకి దించి... చేతినిండాసంపాదించడానికి వాటి యజమానులు ఉవ్విళ్లూరుతారు. పండగవేళ ఆడాళ్లంతా పిండివంటలు.. ముగ్గు, ముచ్చట్లతో బిజీగా ఉంటే..మగమహారాజులు మాత్రం వాటిని భారీస్థాయిలో లాగించి.. సరదాకోసం... వీటితో బిజీ అయిపోతారు. ఆతరువాత మొదలవుతుందిఅసలు మజా. పదికి వందా, వందకి వెయ్యి, వేయికి పదివేలు..పదివేలుకు లక్షంటూ కాయ్రాజాకాయ్ అంటూ విరగబడి పందేలుకడతారు. కొట్టు, కుమ్ము.. ఇరగదియ్.. దూకు... వేసేయ్ అంటూబరిలోని కోళ్లను ఉత్సాహపరుస్తారు. అరుపులు, కేకలతో ఆ ఏరియాఅంతా దద్దరిల్లిపోతుంది. పోలీసు నిఘా ఎక్కువగా ఉండడంతో..సింపుల్గా చేతి వేళ్లతోనే కథ నడిపిస్తారు. ఒక వేలు చూపిస్తే... లక్ష,రెండు వేళ్లు చూపిస్తే... పదిలక్షలు. కాకపోతే ఒక్కో ఏరియాలోఫింగర్కు కేటాయించే ఫిగర్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడంటేడబ్బులు కాని.. అప్పట్లో జమిందారీ వ్యవస్థలో కిల్లీలతో పందెంకాసేవాళ్లు. ఇప్పుడు డబ్బుతో పాటు భూములు, ఇతర ఆస్తులనుకూడా పణంగా పెడుతున్నారు. ఈ పందేలు ఓ రేంజ్ వరకూ బాగానేసాగుతాయి కాని... అక్కడినుంచి పరువు-ప్రతిష్టలుగామారిపోతాయి. ప్రస్టేజ్ క్వశ్చన్ వస్తుంది. అక్కడే తేడా వస్తుంది. ఇదేకొందరిని బికారులుగా మారిస్తే.. మరికొందరిని కుబేరులనుచేస్తుంది.
పల్నాడులోనాయకురాలు నాగమ్మ...రాజకీయమంత్రాంగంతో కోళ్లకాళ్లకు కత్తులు కట్టి బరిలోకిదించింది.ఇలా కోళ్లపందేలకు ఎంతో చరిత్రఉంది. ఇవి కాళ్లకుకత్తులతో... కసిగా కయ్యానికి కాలుదువ్వితే ... ప్రత్యర్థి కోళ్లకుపైప్రాణాలు పైనే పోతాయి. పందెంకోడికి కదనరంగంలోతిరుగులేని వజ్రాయుధం ఈ కత్తి.అందుకే పుంజు ఏ రంగులో ఉంది.. అది ఎలా ఉంది.. ఎంత ఉందిఅన్నదానికన్నా... ఇది తన కత్తిని ప్రత్యర్థి పుంజుపై ఏవాటంలోదింపింది అన్నదే ఇంపార్టెంట్. ఒక్కోసారి ఒకే దెబ్బకు అవతలిపుంజు తల ఎగిరి పడుతుంటాయి. అందుకే వీటికింత ప్రాధాన్యత. ఓప్రాంతంలో స్టీలు, మరో ప్రాంతంలో విమానానికి వాడే ఐరన్ను ఈకత్తుల తయారీ కోసం వాడతారు. ఇది కిలో దాదాపు పదివేలవరకూఉంటుందంటారు. దీంతోపాటు మైలు తుత్తం, యాసిడ్,ఇంకొన్నింటినీ దీనిలో మిక్స్ చేస్తారు. కాకపోతే ఆ మిక్సింగ్లోఏముంటాయన్నది మాత్రం బయటకు చెప్పరు. వీటిని గోగినారతాడుతో కడతారు. నెలల తరబడి వీటిని ఊరబెట్టి నారగా తయారుచేసి దాన్ని తాడుగా పేని మరీ వీటికి వాడతారు. పందెం కోళ్లకు కత్తికట్టేవారికి ఇంతకుముందు రెండు రూపాయలు ఇచ్చేవాళ్లు. కానీఇప్పుడు రోజులు మారాయి. అందుకే ఒక్కో కోడికివందరూపాయలు, ప్లస్ ఓ తొడ ఇవ్వాల్సిందే. ఇక పందెంలో నెగ్గితేవాళ్లు సంతోషంతో ఇచ్చే మొత్తం దీనికి అదనం. దీన్ని బట్టి చూస్తే..రోజుకు ఎలా లేదన్నా 50 నుంచి వంద కోళ్లకు కత్తులు కడతారు.అంటే వీళ్ల ఆదాయం వేలల్లో ఉంటుందన్నమాట. పందాలలోఇదంతా ఒకెత్తు అయితే మందుబాబుల మంత్రాగం మరో ఎత్తు.వీళ్లు తాము తాగడమే కాకుండా.. తమ కోడి పుంజులకూ మందుపట్టిస్తారు. నెమ్మదిగా దీన్ని అలవాటు చేస్తామంటున్నారు. ఇలాచేయడం వల్ల.. ఇవి ఎక్కువసేపు బరిలో నిలబడి పోట్లాడతాయనిఒకవేళ కత్తిగాట్లు పడ్డా... మత్తులో వాటి బాధ తెలియక... త్వరగాపడిపోకుండా ఉంటాయి. పందెంలో అటువైపు కోడికి దెబ్బలుతగిలి.. ఇటువైపు కోడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నిలబడి ఉంటే...ఇదే గెలిచినట్లుగా డిక్లేర్ చేస్తారు. అందుకే ఈ స్థాయిలో వీటికి ట్రైనింగ్తప్పనిసరట.
ఇవేమీ ఆర్డనరీ కోళ్లు కాదు. వెరీ వెరీ స్పెషల్. బరిలోకిదిగాయంటే ప్రత్యర్థి పంబ రేగ్గొట్టేలా ఢీ అంటే ఢీ అంటాయి. కయ్యానికికాలు దువ్వుతూ పౌరుషంతో రెచ్చిపోతాయి. ఈ కోడిపందేలదిచిన్నచితకా చరిత్రేం కాదు. చరిత్రలో సమరాల్నే సృష్టించాయి...రాజ్యాల్నే కూల్చేశాయి. ఎంతోమంది తలరాతలు మార్చేశాయి.
సంక్రాంతి సీజన్వచ్చిందంటే పల్లెల్లోహడావుడిమొదలవుతుంది.పల్లెజనం మేల్కొనేదికొక్కొరోకో సౌండ్తోనే.సంకురాత్రి సంబరాల్లో...కోస్తా వాసులకు పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ... కోళ్ల పందాలే!అంతవరకూ బాగా మేపిన కోళ్లను బరిలోకి దించి... చేతినిండాసంపాదించడానికి వాటి యజమానులు ఉవ్విళ్లూరుతారు. పండగవేళ ఆడాళ్లంతా పిండివంటలు.. ముగ్గు, ముచ్చట్లతో బిజీగా ఉంటే..మగమహారాజులు మాత్రం వాటిని భారీస్థాయిలో లాగించి.. సరదాకోసం... వీటితో బిజీ అయిపోతారు. ఆతరువాత మొదలవుతుందిఅసలు మజా. పదికి వందా, వందకి వెయ్యి, వేయికి పదివేలు..పదివేలుకు లక్షంటూ కాయ్రాజాకాయ్ అంటూ విరగబడి పందేలుకడతారు. కొట్టు, కుమ్ము.. ఇరగదియ్.. దూకు... వేసేయ్ అంటూబరిలోని కోళ్లను ఉత్సాహపరుస్తారు. అరుపులు, కేకలతో ఆ ఏరియాఅంతా దద్దరిల్లిపోతుంది. పోలీసు నిఘా ఎక్కువగా ఉండడంతో..సింపుల్గా చేతి వేళ్లతోనే కథ నడిపిస్తారు. ఒక వేలు చూపిస్తే... లక్ష,రెండు వేళ్లు చూపిస్తే... పదిలక్షలు. కాకపోతే ఒక్కో ఏరియాలోఫింగర్కు కేటాయించే ఫిగర్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడంటేడబ్బులు కాని.. అప్పట్లో జమిందారీ వ్యవస్థలో కిల్లీలతో పందెంకాసేవాళ్లు. ఇప్పుడు డబ్బుతో పాటు భూములు, ఇతర ఆస్తులనుకూడా పణంగా పెడుతున్నారు. ఈ పందేలు ఓ రేంజ్ వరకూ బాగానేసాగుతాయి కాని... అక్కడినుంచి పరువు-ప్రతిష్టలుగామారిపోతాయి. ప్రస్టేజ్ క్వశ్చన్ వస్తుంది. అక్కడే తేడా వస్తుంది. ఇదేకొందరిని బికారులుగా మారిస్తే.. మరికొందరిని కుబేరులనుచేస్తుంది.
కోడిపందేలే కదా అని చిన్న చూపు అక్కర్లేదు. ఎందుకంటేఇవీ మధ్య క్రికెట్ బెట్టింగ్ను మించిపోతున్నాయి. ఒక్కో ఊళ్లో కోట్లరూపాయలు చేతులు మారతాయి. మొత్తంగా చూస్తే వందలకోట్లలోవ్యాపారం జరుగుతుంది. అలా అని ఎవరైనా పందెంకాయచ్చనుకుంటే కుదరదు. ఎందుకంటే.. కనీసం ఐదులక్షలుంటేకాని పందెంలో పార్టిసిపేట్ చేయలేరు. లక్షో, రెండు లక్షలో ఉన్నాయికదా నేనూ రెడీ అంటే మీవైపు ఎగాదిగా చూస్తారు.
ఈ కోడి పుంజును కుక్కుటేశ్వరస్వామికి ప్రతీకగాకొలుస్తారు జనం. అందుకే పెద్ద పండగకి సంప్రదాయంగా వీటితోపోటీలు ఏర్పాటు చేసుకుంటామని చెబుతారు. చట్టపరంగా వీటిపైనిషేధం ఉన్నా... చాటుమాటుగా ఇవి జరుగుతాయి. పెళ్లిళ్లకు కూడాలేనంత హంగామా వీటికుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడుపందాలను ఏర్పాటు చేసేయరు. దానికీ ఓ లెక్కుంటుంది.పంచాంగం గట్రా చూసి... మంచి-చెడు లెక్కించి... ముహూర్తాలుపెట్టించి మరీ కోళ్లను బరిలోకి దించుతారు పందెంరాయుళ్లు. రంగుడామినేషన్ బట్టికూడా పందెం కొట్టుకొస్తుందని వీరి నమ్మకం.అంతేకాక వీటి రంగు, అది పోరాడే టైమ్లో ఉండే నక్షత్రం బట్టి ... 24గంటలను భాగాలుగా లెక్కించి ఏ రంగు పుంజు పందెంనెగ్గుతుందోనని కూడా లెక్కలు వేస్తారు. పౌర్ణమి దగ్గరగా ఉంటే తెలుపు రంగు పుంజులు కసిగా కుమ్ముతాయని, అమావాస్యదగ్గరగా ఉంటే నలుపు రంగు పుంజులు కేక పుట్టిస్తాయని వీరి లెక్క.చాలావరకూ ఇలా జరుగుతుందంటారు . అసలు కోళ్లకుసంబంధించి కుక్కుటశాస్త్రం ఉందంటే నమ్ముతారా? దీన్నికొంతమంది కుక్కుటపురాణం అని కూడా అంటారు. పుస్తకాలుప్రింట్ చేస్తున్నారంటే దీనిపై జనానికి నమ్మకం ఏ రేంజ్లోపెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జాములు, నక్షత్రాలు బట్టేపందేలలో కోళ్లు నెగ్గుకొస్తాయని.. ఇది పురాతన కాలం నుంచిఉన్నదే అని అంటున్నారు కుక్కుటశాస్త్ర కోవిదులు. కోడిపుంజులను తెల్ల కళ్లవి, నల్ల కళ్లవి అంటూ డివైడ్ చేస్తారు కూడా.నళ్లకళ్లవాటిలో పోరాడే శక్తి అధికంగా ఉంటుందట. కాని ఇవి చాలాఅరుదుగా దొరుకుతాయని అంటారు. కోడి పుంజు తలపై కిరీటంలాఉంటుంది కదా ఇది... ఏడు వరసలు ఉంటే దానికి తిరుగులేదనిచెబుతారు.
మీ ఇంట్లో నాలుగు కోళ్లున్నాయి కదా అని వాటినిపందేలకు సిద్దం చేసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఈ గేమ్లోపాల్గోవాలంటే కొన్ని రకాల పుంజులే పనికొస్తాయి. సాధారణంగారంగులను బట్టి వీటి జాతిని నిర్ణయిస్తారు. కెక్కిరాయి, రసంగి,ఏరువా, మైల, అబ్రాక్, పర్లా, సవలాలు, పతంగి, ఎర్రకచ్చురాయి,నల్లకచ్చురాయి, ఊడిద, డేగ, పండుడేగ, ఇసుకడేగ, నెమళ్లు,కాకులు, తీతువ, జీడిపప్పు దండిగా తినే కాజు రకం కోళ్లుఉన్నాయి. రెండు మూడు రంగులు కలసి ఉన్న వాటిని కాకిడేగ,పచ్చకాకి, తింగ్లా, దుగడా, ఎర్రమైలా, నల్లమైలా, ఎర్రకిక్కర,నల్లకిక్కర పర్లానెమలితో పాటు... మరికొన్ని కూడా ఉన్నాయి.
మీరు రోజూ ఏం తింటారు? కూరతోనో, చారుతోనో భోజనంలాగించేస్తారు. వీకెండ్‌లోనో, ఏ పండక్కో చికెనో, మటనో కుమ్మేస్తారు.కానీ.. రోజూ బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా లాంటివాటితో లంచ్చేయగలరా? నవధాన్యాలతో చేసిన చపాతీలతో డిన్నర్ముగించగలరా? అంత సీన్ ఎక్కడిది అంటారా? అయితే ఈ కోళ్లలైఫ్స్టైల్ చూస్తే మీకళ్లు తిరుగుతాయి. చంటిపిల్లలను ఏ విధంగాసాకుతామో.. అలా పెంచుతారు వీటిని. చిన్న పిల్లలుగాఉన్నప్పుడు పదిరోజుల పాటు నూకలు వేస్తారు. నెమ్మదిగా గంట్లుకూడా పెడతారు. వడ్లు ఆడించి చోళ్లు కలిపి కూత పెట్టే టైమ్కి రెండునెలలపాటు మేత కింద వేస్తారు. పందానికి 40రోజుల ముందు నుంచి ఉదయాన్నే కోడిగుడ్డులోని తెల్లసొన, విటమిన్ టాబ్లెట్స్,చోళ్ళు, జొన్నలు, గంటెలు, రాగులు, సజ్జలు, జీడిపప్పు, బాదంపప్పులతో బాగా మేపుతారు. మెరుపులు, గోధుమలు, కిస్మిస్కూడా ఇస్తారు. నవధాన్యలతో తయారు చేసిన చపాతీలతో లంచ్..ఇక ఈవెనింగ్ మిక్స్డ్ డ్రైఫ్రూట్స్తో డిన్నర్. ఇది వీటి మెనూ.
ఈ లెక్కన వీటిని మేపితే... ఖర్చెంతవుతుంది అనేగా మీ డౌట్.ఒక్కో కోడికి ఫుడ్ ఖర్చు కింద.. నెలకీ ఎలా లేదన్నా ఐదు నుంచిఎనిమిది వేల రూపాయలన్నా అవుతాయి. ఇంత పెట్టి పెంచితే ఏంటిలాభం అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కో పందెం కోడి రేటు ఐదువేలతోమొదలై.. యాభై వేలు ఈజీగా దాటిపోతుంది. పందేలు లక్షలు,కోట్లలో ఉంటే వీటికి ఈ మాత్రం రేటు లేకపోతే ఎలా అంటారుపందేలరాయుళ్లు.
ఇవి కూతకొచ్చాక మొదలవుతుంది అసలు కథ. మిలట్రీలోసైనికులకు ఇచ్చినట్టు.. స్ట్రిక్ట్గా చాలా టఫ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇవిఎంతవరకూ పందెంలో నెగ్గుకురాగలవో చెక్ చేయడానికిమామూలు కోళ్లతో ప్రాక్టీస్ చేయిస్తారు. తరువాత పందెం కోళ్ల మధ్యేపోటీ పెట్టి... ఏవి జబర్దస్తీగా పోరాడతాయో చెక్ చేస్తారు. వీటి బాడీ ఏరేంజ్‌లో ఉంది.. వీటి ఫైటింగ్ స్టైల్... గెలవగలదా లేదా అన్న మేటర్బట్టి... వీటి రేటు ఈజీగా పదివేల వరకూ ఉంటుంది. పెట్టలవైపుకన్నెత్తి చూడకుండా ఉండడానికి పందెం కోళ్లను... ప్రత్యేకమైదానాలలో , పెద్ద పెద్ద గాపులలో ఉంచుతారు. వయసొచ్చినతరువాత ఇవి పెట్టలపైకి వెళితే... దెబ్బలాడే సామర్థ్యం పోయిబాడీలో పార్టులన్నీ సరిగా సహకరించవని ఇలా చేస్తారు.

కోడి పుంజుల అమ్మకాలకు పెట్టింది పేరు... రాజమండ్రిజాంపేట మార్కెట్. అసలిక్కడ దొరకని కోడి పుంజు అంటూఉండదంటే నమ్మండి. పందెం కోళ్లలో ఎన్ని రకాలు ఉన్నా..కాకులు, సవలాలు లాంటి కోడిపుంజెలకు గిరాకీ ఎక్కువ. వెయ్యినుంచి మూడు వేలు ఖరీదు చేస్తాయివి. సంక్రాంతి వచ్చిందంటేనిజంగా వీళ్లకు పండగ వచ్చినట్టే. ఉభయగోదావరి జిల్లాలలోనుంచి ఎక్కువమంది ఇక్కడే కొంటారు. అసలు కోనసీమ పల్లెల్లోసంక్రాంతికి కళ వచ్చేది వీటితోనే. ఇక్కడే ఈ పోటీలు ఎక్కువ.భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి, కోరుకొండలో జోరుగాసాగుతాయి. ఇక గోపాలపురం, పోలవరం, నర్సాపురం, గోకవరం,సీతానగరంతో పాటు ఏజెన్సీలో రంపచోడవరంలాంటి ప్రాంతాల్లోనూఈ ఫైటింగ్ సీన్లు కనిపిస్తాయి. కోడి పందాల్లో రెండు రకాలుంటాయి.కోసు పందాలు, జట్టీ పందాలు. కోసు పందాల్లో అయితే పందెం కిందపదికి యాభై, వంద ఇలా డబుల్, ట్రిపుల్ అమౌంట్లు ఉంటాయి.ఎందుకంటే ఈ కేటగిరీలో పోటీకి దిగే కోళ్ల కాళ్లకు కత్తులుంటాయి.పోటీలు నిర్వహించేవాళ్లే ఈ కత్తులిస్తారు. పోటీదారులే కొన్నిసార్లుపదునుకత్తులు తెచ్చుకుంటారు. అవి కనుక గుచ్చుకుంటే కోడిప్రాణం పోయినట్టే. కొన్ని సందర్భాల్లో తినడానికి కూడాపనికిరానంతగా ఆ మాంసం తయారవుతుంది.
ఇక జట్టీ పందాలు మరో రకం. ఇందులో కోళ్ల కాళ్లకు కత్తులుఉండవు. అందుకే ఇవి చాలా తక్కువుగా జరుగుతాయి.అక్కడక్కడా పల్లెల్లో ఈ టైపు పోటీలు కనిపిస్తాయి. ప్రాంతాన్ని బట్టి,వారి ఆచార సంప్రదాయలను బట్టి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో ట్రెడిషన్కంటిన్యూ అవుతోంది.గోదావరి జిల్లాల్లో పండగ నాలుగు రోజులు...వేలాది కోడింపుంజులు పందెంరాయుళ్ల సరదాలకు బలైపోతాయి.పందెంలో నెగ్గిన కోడికి ఎంత డిమాండ్ ఉందో... ఓడిపోయి,చనిపోయిన కోడికి కూడా అంతకంటే ఎక్కువ డిమాండే ఉంటుంది.ఎందుకంటే యుద్దరంగంలో ఓడి చనిపోయిన కోడిని కోజా కోడిఅంటారు. దీనిలో ఓ తొడ భాగాన్ని కత్తికట్టినవాడికి ఇచ్చేస్తారు.మిగిలిన భాగాన్ని యజమానులు తీసుకెళ్తారు. దీని టేస్ట్ చాలాబాగుంటుందని... వేల రూపాయలు పెట్టి మరీ కొంటారుభోజనప్రియులు. దూరప్రాంతాల్లో ఉన్న తమవాళ్లకోసం ఈ కోజాకోడి మాంసంతో ప్రత్యేకంగా ఊరగాయ కూడా పెట్టిస్తారు. ఇకపండగకు వచ్చిన చుట్టాలు, బంధువులకు, ముఖ్యంగా అల్లుళ్లకుదీంతో విందుభోజనం రెడీ చేస్తారు.
Subscribe to:
Posts (Atom)